Daku Maharaj: అరబిక్ న్యూస్ పేపర్ లో ‘డాకు మహారాజ్’ 11 d ago

ఈ సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్’ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఓ అరబిక్ న్యూస్ పేపర్ లో ప్రత్యేక స్థానం లభించింది. దీంతో మరోసారి 'డాకు మహారాజ్' గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఎక్స్ లో బాలకృష్ణ అభిమానులు షేర్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, సాంకేతికతను ప్రశంసిస్తూ కథను రాబిన్ హుడ్ శైలిలో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఓటీటీలోనూ ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ‘నెట్ ఫ్లిక్స్’లో టాప్ పోజిషన్‌ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఇది 'నెట్ ఫ్లిక్స్' వేదికగా అందుబాటులో ఉంది.